వైసీపీ ఆ తప్పులు చేయదనే భావిస్తున్నాం: జీవీఎల్

  • టీడీపీది అంతులేని అహంకారం
  • అదే వాళ్ల ఓటమికి కారణమైంది
  • టీడీపీకి ఓటమి తప్పదని ముందే చెప్పాం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడం పట్ల బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. అవినీతి ముద్ర వేసుకున్న టీడీపీ సర్కారు ఈ స్థాయిలో ఓటమి ఎదుర్కొంటుందని తాము ముందే ఊహించామని, ఇదే విషయాన్ని తాను మీడియా ముఖంగా వెల్లడించానని జీవీఎల్ తెలిపారు. అయితే, ఈ ఐదేళ్ల పాలనలో టీడీపీ చేసిన తప్పులను వైసీపీ చేయదనే భావిస్తున్నామని చెప్పారు.

అంతులేని అహంకారం, అవినీతి టీడీపీని అంతమొందించాయని అన్నారు. టీడీపీ చేసిన కొన్ని తప్పులే జగన్ భారీ విజయానికి దోహదపడ్డాయని చెప్పారు. రాజకీయాల్లో ఏ పార్టీకి అహంకారం అనేది ఉండకూడదని హితవు పలికారు. హద్దుమీరిన అహంకారమే టీడీపీని ఓటమిదిశగా తీసుకెళ్లిందని వివరించారు.

"వారికి ఎంత అహంకారం అంటే, నన్ను నాలుక కోస్తాం అనేవాళ్లు. వైసీపీని కోడికత్తి పార్టీ అనేవాళ్లు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కోడికత్తి పార్టీ అనడాన్ని ఎలా భావించాలి? చిన్నాచితకా రాజకీయనేతలు మాట్లాడితే పట్టించుకోనవసరంలేదు, కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అవి? చిన్నదో పెద్దదో జగన్ పై దాడి జరిగింది, దాన్నిపట్టుకుని రచ్చ చేయడం సబబు కాదు" అంటూ మండిపడ్డారు.

GVL
Chandrababu
Jagan
BJP
YSRCP

More Telugu News