నా దగ్గరికి వచ్చే అభిమానులకు నేను ఇదే మాట చెబుతాను: కమెడియన్ సునీల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా దగ్గరికి వచ్చే అభిమానులకు నేను ఇదే మాట చెబుతాను: కమెడియన్ సునీల్

  • కమెడియన్ గా ఆదరించారు 
  • హీరోల అభిమానులంతా నా సినిమాలు చూస్తారు
  •  సమయాన్ని వృథా చేసుకోవద్దనే చెబుతాను 
ఒక వైపున హీరోగా .. మరో వైపున కమెడియన్ గా చేస్తూ సునీల్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "అందరి హీరోల అభిమానులు నన్ను ఇష్టపడతారు .. నా సినిమాలు చూస్తారు. నిజం చెప్పాలంటే నేను చేసుకున్న అదృష్టం అది. నాకంటూ ప్రత్యేకంగా అభిమాన సంఘాలు లేవు.

గతంలో కొంతమంది వచ్చి అభిమాన సంఘాలు పెడతామని అన్నారు. 'అలాంటి పని చేయకండి .. సమయం చాలా విలువైంది .. అలాంటి సమయాన్ని మీ కుటుంబం కోసం కేటాయించండి. జీవితంలో ఏదైనా సాధించదలచుకుంటే దానిపై దృష్టి పెట్టండి. మీరు మీ పని చేసుకుంటూనే .. నా సినిమా ఒకసారి చూడండి .. బాగుంటే పదిమందికి చెప్పండి. అంతేగాని ఇలా నా కోసం మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు .. జీవితంలో తిరిగిరానిది సమయమే అని చెబుతుంటాను" అన్నారు. 
sunil

More Telugu News