ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అవి నిజం కావొచ్చు, అబద్ధం కావొచ్చు!: టీడీపీ నేత వర్లరామయ్య
- ఈసీని వెంటనే ప్రక్షాళన చేయాలి
- మోదీ అన్నింటిని భ్రష్టు పట్టించారు
- అమరావతిలో మీడియాతో వర్ల, యనమల
మరోవైపు ఈ వ్యవహారంపై వర్లరామయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చివరికి ఈసీని కూడా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటకు విలువ లేదని సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా చెప్పడమే ఇందుకు నిదర్శమని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్‌ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదనీ, అవి నిజం కావచ్చు లేదా అబద్ధం కూడా కావచ్చని రామయ్య పేర్కొన్నారు.