ఈ కుళ్లు రాజకీయాల్లోకి రావొద్దని చిరంజీవిగారికి ముందే చెప్పాను: సీనియర్ హీరోయిన్ జమున
- ఒకప్పటి రాజకీయాలు వేరు
- ఇప్పటివి కుళ్లు రాజకీయాలు
- ఈ కుళ్లును కడిగేయడం కష్టం
"చిరంజీవిగారికి కూడా నేను ఇదేమాట చెప్పాను. మా అమ్మాయి పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికి వెళ్లినప్పుడు, 'చిరంజీవిగారూ .. మీరు గొప్ప ఆర్టిస్ట్ .. మిమ్మల్ని ఎంతగానో అభిమానించేవాళ్లున్నారు. దయచేసి ఈ కుళ్లు రాజకీయాల్లోకి మాత్రం రావొద్దు' అని చెప్పాను. అప్పుడు అయన నవ్వేసి ఊరుకున్నారు .. కానీ వచ్చాక ఏం జరిగింది? మేమేదో వచ్చేస్తాం .. ఈ కుళ్లును కడిగేస్తాం అంటే .. అది చాలా కష్టమైన విషయం .. జరిగేపని కూడా కాదు" అంటూ చెప్పుకొచ్చారు.