చరిత్ర సృష్టించనున్న తెలంగాణ హైకోర్టు... కాళేశ్వరంపై నేడు ఒకేసారి 177 పిటిషన్ల విచారణ!
- పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేబట్టవద్దంటూ పిటిషన్లు
- సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం
- అన్నింటిపైనా నేడు విచారణ
రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని దాఖలైన పిటిషన్లే ఇందులో అధికంగా ఉన్నాయి. కాళేశ్వరం ముంపు పరిధిలోని కిష్టాపూర్ లో పనులు చేయరాదని గతంలో సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. కిష్టాపూర్ తో పాటు ఇప్పుడు పలు ఇతర గ్రామాల ప్రజలు కూడా పిటిషన్ లలో భాగం అయ్యారు. కిష్టాపూర్ పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అపీల్ చేయగా, దానిపైనా నేడు విచారణ జరగనుంది.