మోదీ తల్లిదండ్రులను అవమానించడం కంటే చనిపోవడానికే ఇష్టపడతా: రాహుల్ గాంధీ
- వాస్తవ అంశాలను పక్కన బెట్టేస్తారు
- మామిడి పండ్లు, మేఘాల గురించి మాట్లాడుతారు
- దేశానికి ఏం చేశారో చెప్పరు
తాను మోదీ తల్లిదండ్రులను అవమానించాల్సిన పరిస్థితే వస్తే, దానికంటే చనిపోవడానికే ఇష్టపడతానని రాహుల్ పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ, వాస్తవ అంశాలను పక్కనబెట్టి మామిడ పండ్లు, మేఘాల గురించి మాట్లాడతారని రాహుల్ ఎద్దేవా చేశారు. మామిడి పండ్లు ఎలా తినాలో చెబుతారు కానీ నిరుద్యోగ యువతకు, దేశానికి ఏం చేశారో చెప్పరని విమర్శించారు.