వాయిస్ కాల్స్ ద్వారా వైరస్.. వెంటనే అప్డేట్ చేసుకోమంటున్న వాట్సాప్ యాజమాన్యం
- వ్యక్తిగత, రహస్య సమాచారమంతా తస్కరణ
- ఫోన్లలో ప్రవేశించిన స్పైవేర్
- మే నెల మొదటి వారంలో గుర్తించిన సంస్థ
వాట్సాప్ వాయిస్ కాల్స్ అదనపు భద్రతకు సంబంధించి ఫీచర్లను జత చేస్తుండగా ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ డెవలప్ చేసిన స్పైవేర్ ఫోన్లలో ప్రవేశించిందని వాట్సాప్ యాజమాన్యం వెల్లడించింది. ఈ స్పైవేర్ అటాక్ అయినట్టు మే నెల మొదటి వారంలో గుర్తించామని వెంటనే తమ టీం ఆ సమస్యను పరిష్కరించిందని తెలిపారు. కాబట్టి వెంటనే వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ ప్రతినిధి ఒకరు సూచించారు.