ఢిల్లీలో పోలింగ్ ఇలా ముగిసిందో లేదో.. కిక్కిరిసిన వైన్‌షాపులు.. కనిపించిన నోస్టాక్ బోర్డులు!
- శుక్రవారం సాయంత్రం మూతబడిన మద్యం దుకాణాలు
- ఆదివారం పోలింగ్ ముగిశాక తెరుచుకున్న షాపులు
- వైన్‌షాపుల వద్ద మందుబాబుల జాతర
శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం ఆదేశాలతో మద్యం షాపులను మూసివేశారు. దీంతో రెండు రోజులపాటు దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు విషయాన్ని ముందే గ్రహించిన మందుబాబులు శుక్రవారమే పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకున్నారు. శనివారం షాపులు పూర్తిగా మూతపడ్డాయి. తిరిగి ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఆరు గంటల ప్రాంతంలో దుకాణాలు తెరుచుకున్నాయి. దాదాపు 36 గంటలపాటు మద్యం లేక నానా అవస్థలు పడిన మద్యం ప్రియులు ఆదివారం షాపులు తెరిచీ తెరవగానే వాటిపై పడ్డారు. దీంతో దుకాణాల వద్ద కోలాహలం నెలకొంది. చాలా షాపుల ఎదుట ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి.