లండన్ లో హైదరాబాద్ యువకుడ్ని హత్యచేసింది ఓ పాకిస్థానీ!
- ఉద్యోగంలోంచి తీసేశాడని దారుణం
- నిందితుడ్ని ఆకిబ్ పర్వేజ్ గా గుర్తింపు
- కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
అయితే, రెండ్రోజుల క్రితం నదీముద్దీన్ తాను పనిచేస్తున్న స్టోర్ సమీపంలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. అతడిని చంపింది ఆకిబ్ పర్వేజ్ అనే పాకిస్థాన్ యువకుడని తెలిసింది. ఆకిబ్ రెండువారాల కిందటి వరకు నదీముద్దీన్ పనిచేస్తున్న స్టోర్ లోనే పనిచేసేవాడు. సరిగా పనిచేయడంలేదన్న కారణంతో ఆకిబ్ ను నదీముద్దీన్ విధుల్లోంచి తొలగించాడు. దాంతో అతడిపై కక్షగట్టిన ఆకిబ్ అదనుచూసి అంతమొందించాడు. బర్మింగ్ హామ్ లో ఈ పాకిస్థాన్ యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.