భారత్ పై ఐసిస్ ఉగ్ర పంజా.. అనుబంధ విభాగాన్ని ప్రారంభించిన కిరాతక మూక!
- విలాయా ఆఫ్ హింద్ గా నామకరణం
- అధికార పత్రిక అమాక్ లో ప్రకటన
- కశ్మీర్ లో తమ సైనికులు పోరాడుతున్నారని వెల్లడి
అయితే విలాయా ఆఫ్ హింద్ భౌగోళిక పరిధిపై ఐసిస్ స్పష్టత ఇవ్వలేదు. తమ సైనికులు జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలతో పోరాడుతున్నారని ఐసిస్ ఆ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రకటనను జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. పశ్చిమాసియాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఉనికిని చాటుకునేందుకు ఐసిస్ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని అభిప్రాయపడ్డారు. భారత్ లో ఐసిస్ ఉనికి లేదని ఆయన తేల్చిచెప్పారు.