అరే భయ్ ఆయన్ను పిలువు అన్నా.. అంతే గొడవకు దిగాడు: వీహెచ్
- టీవీ ఛానళ్ల వల్లే ఇలాంటి గొడవలు
- ఓ కుర్రాడికి, నాకు మధ్య చిన్నపాటి ఘర్షణ
- మాదేం పార్టీ గొడవ కాదు
- ఉద్రేకంలో ప్రచారం కోసం ఇలా చేశాడు
తాను ‘అరే భయ్, ఆయన్ను పిలువు’ అని అన్నానని దీంతో నగేశ్ గొడవకు దిగాడని వీహెచ్ తెలిపారు. తమదేం పార్టీ గొడవ కాదని, వ్యక్తిగత సమస్య అని పేర్కొన్నారు. ఏదో ఉద్రేకంలో ప్రచారం కోసం ఇలా చేశాడని, తాను చర్యలు తీసుకోమని చెప్పనని తెలిపారు. అసలు టీవీ ఛానళ్ల వల్లే ఇలాంటి గొడవలు వస్తాయన్నారు. జనరల్ సెక్రటరీలుగా పార్టీకి ఉపయోగపడేవారిని తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడికి సూచిస్తున్నట్టు వీహెచ్ తెలిపారు.