కేసీఆర్ గోడమీద పిల్లిలాంటోడు.. చంద్రబాబు అవకాశవాది: దత్తాత్రేయ
- ఫెడరల్, మహాకూటములు దరిదాపుల్లోకి కూడా రావు
- టీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది
- ఇంటర్ అవకతవకలపై విచారణ జరిపించాలి
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచి ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జితో ఇంటర్ బోర్డు అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థకు వ్యతిరేకంగా కమిటీ రిపోర్ట్ ఇచ్చినా ఎలాంటి చర్యా తీసుకోలేదని దత్తాత్రేయ విమర్శించారు. ఫెడరల్, మహాకూటములు తమ దరిదాపుల్లోకి కూడా రావన్నారు. టీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని దత్తాత్రేయ పేర్కొన్నారు.