అప్పట్లో జయచిత్రకి, నాకు గొడవ జరిగినట్టుగా రాశారు: జయసుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పట్లో జయచిత్రకి, నాకు గొడవ జరిగినట్టుగా రాశారు: జయసుధ

  • మేమంతా చాలా స్నేహంగా ఉంటాము
  • మా మధ్య ఎలాంటి ఈగోస్ వుండవు
  • ఆ మాత్రానికే గొడవైందని రాశారు     
సావిత్రి .. వాణిశ్రీ తరువాత ఆ స్థాయి నటిగా జయసుధకు పేరుంది. ఎలాంటి పాత్రనైనా అందులో ఒదిగిపోయి మెప్పించడం ఆమె ప్రత్యేకత. అలాంటి జయసుధ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. "అప్పట్లో హీరోయిన్స్ గా చేస్తోన్న మేమంతా ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. ఇప్పటికీ జయప్రద .. రాధిక .. శ్రీప్రియ .. రాధ .. అంబిక .. ఖుష్బూ .. సుహాసిని ఇలా అందరం మంచి స్నేహితులుగా ఉంటాము.

మా తరం హీరోయిన్స్ కి ఈగో అనేది తెలియదు. మా మధ్య ఈగోస్ వున్నట్టుగా అప్పట్లో ఒక వార్త కూడా వచ్చింది. ఒకసారి అవుట్ డోర్ లో షూటింగ్ జరుగుతోంది. జయచిత్రగారు నాకంటే కొంచెం హైట్ తక్కువ. తాను హైహీల్స్ వేసుకుంది .. నేనూ హైహీల్స్ వేసుకున్నాను. తను పొట్టిగా కనిపిస్తున్నానని చెప్పేసి, నన్ను చెప్పులు తీసేయమని అంది. నేను మరో చెప్పుల జత తెచ్చుకోలేదు .. అందువలన నేను తీయనని చెప్పాను. అంతే, మా ఇద్దరికీ గొడవైపోయిందంటూ చాలా రకాలుగా రాశారు" అని చెప్పుకొచ్చారు. 
jayasudha
jayachitra

More Telugu News