నన్ను పోషిస్తాడనుకున్నవాడు నాపై ఆధారపడి హింసలు పెట్టాడు: నటి రాగిణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను పోషిస్తాడనుకున్నవాడు నాపై ఆధారపడి హింసలు పెట్టాడు: నటి రాగిణి

  • చిన్నతనంలోనే పెళ్లి చేశారు 
  • డబ్బుకోసం వాడు వేధించేవాడు 
  • నన్ను .. బాబును వదిలేసి వెళ్లిపోయాడు
నటిగా రాగిణి తన ప్రయాణాన్ని ప్రారంభించి 35 యేళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘమైన ఈ కెరియర్లో ఆమె ఎన్నో ఒడిదుడుకులను చూశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, జీవితంలో తనకి ఎదురైన కొన్ని అనుభవాలను గురించి ప్రస్తావించారు. "నాకు 12 యేళ్లు ఉన్నప్పుడే మా పెద్దక్కయ్య తీసుకెళ్లి పెళ్లి చేసింది. ఆ వ్యక్తితో ఓ ఏడాదిపాటు కాపురం చేశాను .. మా ఇద్దరికీ ఒక బాబు.

ఆయన నన్ను పోషిస్తాడు గదా అని నేను అనుకుంటే, ఆయన ఏ పనీ చేసేవాడు కాదు. ఏదో ఒకటి చేసి నువ్వే సంపాదించాలి అని వేధించడం మొదలుపెట్టాడు. ఆయన వ్యసనాలకు అవసరమైన డబ్బును సంపాదించే యంత్రంలా నన్ను మార్చేద్దామని చూశాడు. అందుకు నేను నిరాకరించడంతో చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. దాంతో నా కొడుకుతో పాటు మా మరో అక్కయ్య పిల్లలిద్దరినీ చదివించుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు. 
ragini

More Telugu News