ఆయనంటే నాకు చాలా ఇష్టం.. వికీలీక్స్ అసాంజేను జైల్లో కలిసిన పమేలా ఆండర్సన్
- అసాంజే పరిస్థితి ప్రమాదకరంగా ఉంది
- ఆయన జీవితాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది
- ఆయన సంక్షేమం కోసం అందరూ పోరాటం చేయాలి
ఈక్వెడార్ ఎంబసీలో అసాంజే తలదాచుకున్నప్పుడు... ఆయనను పమేలా ఆండర్సన్ పలుమార్లు కలిశారు. దాదాపు ఏడేళ్ల తర్వాత అసాంజేకు ఆశ్రయాన్ని ఇవ్వడానికి ఈక్వెడార్ నిరాకరించింది. దీంతో, బ్రిటీష్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అమెరికా సైన్యం చేసిన అనేక దారుణాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నిజాలను వికీలీక్స్ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.