రాహుల్ మెడకు యూపీఏ హయాంలో జరిగిన రక్షణ ఒప్పందం ఉచ్చు?
- స్కార్పియన్ జలాంతర్గాముల విడిభాగాలకు సంబంధించిన డీల్
- తన మిత్రుడికి లాభం చేకూర్చారని బీజేపీ ఆరోపణ
- ఫ్లాష్ ఫోర్జ్ సంస్థకు నేవల్ సబ్ కాంట్రాక్టు
వివరాల్లోకి వెళితే...ముంబయిలోని మజగావ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్)లో తయారయ్యే స్కార్పీన్ జలాంతర్గాములకు అవసరమయ్యే విడిభాగాలు సరఫరా చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ‘నేవల్ గ్రూప్’ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ 2011లో విశాఖకు చెందిన ‘ఫ్లాష్ ఫోర్జ్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీతో సబ్ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ సంస్థ డైరెక్టర్లలో ఉల్రిక్ మెక్నైట్ ఒకరు.
ఇతను 2012 నవంబరు 8న ఫ్లాష్ ఫోర్జ్ డైరెక్టర్గా నియమితుడయ్యాడు. ఇతనికి సంస్థలో 4.9 శాతం వాటా వుంది. ఇదే మెక్నైట్తో కలిసి రాహుల్ గాంధీ 2003లో ‘బ్యాకప్ ఆపరేషన్స్ లిమిటెడ్’ పేరుతో బ్రిటన్లో ఓ సంస్థను నెలకొల్పారు. ఫ్లాష్ ఫోర్జ్లో తన మిత్రుడు ఉన్నందునే అతనికి లాభం చేకూర్చేలా అప్పట్లో యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిందన్నది బీజేపీ తాజా ఆరోపణ.