సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి ఫేస్ బుక్ నిండా అమ్మాయిలే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి ఫేస్ బుక్ నిండా అమ్మాయిలే!

  • ఫేస్ బుక్ ఖాతాలో 327 మంది స్నేహితులు
  • 60 మందికి పైగా అమ్మాయిలు
  • ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఫొటో ప్రొఫైల్ పిక్
హాజీ పూర్ లో వరుస అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి ఫేస్ బుక్ లో వందలాది మంది స్నేహితులు ఉండటం విశేషం. మొత్తం 327 మంది ఫేస్ బుక్ స్నేహితులు ఉండగా... వీరిలో 60 మందికి పైగా అమ్మాయిలే ఉన్నారు. వీరిలో ఓ యువతితో అత్యంత సన్నిహితంగా తీసుకున్న సెల్ఫీలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ ఫొటోనే ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. ఆ యువతి శ్రీనివాసరెడ్డి ప్రియురాలిగా పోలీసుల విచారణలో తేలింది. ఆమెది సిరిసిల్ల జిల్లా వేములవాడ. ఇరువురి పరిచయం ప్రేమగా మారడం, పెళ్లికి కూడా ఆమె అంగీకరించడంతో... శ్రీనివాసరెడ్డి ఆమెకు ఎలాంటి హాని తలపెట్టలేదని సమాచారం.

ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న శ్రీనివాసరెడ్డిని విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని రాచకొండ పోలీసులు నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు, శ్రీనివాసరెడ్డికి బెయిల్ లభించకుండా, పక్కా ఆధారాలను సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
srinivar reddy
killer
facebook

More Telugu News