హైదరాబాద్ సిటీ బస్సులో తుపాకి కాల్పుల కలకలం .. నిందితుడి కోసం పోలీసుల గాలింపు!
- ఫుట్ బోర్డుపై నిలుచున్న ప్రయాణికుడు
- దిగేందుకు ససేమిరా అనడంతో వాగ్వాదం
- గొడవ తీవ్రంకావడంతో గాల్లోకి కాల్పులు
ఈ సందర్భంగా ఫుట్ బోర్డుపై నిలుచున్న అతడిని కిందకు దిగాలని డ్రైవర్ కోరగా, దిగనని మొండికేశాడు. ఈ సందర్భంగా ప్రయాణికులతో వాగ్వాదం చెలరేగడంతో ఒక్కసారిగా తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ పైనుంచి దూసుకెళ్లింది. కాగా, ఈ ఘటనపై ఇటు బస్సు డ్రైవర్, అటు కాల్పులు జరిపిన వ్యక్తి ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.