స్పోర్ట్స్ నేపథ్యంలో కీర్తి సురేశ్ సినిమా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పోర్ట్స్ నేపథ్యంలో కీర్తి సురేశ్ సినిమా

  • నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేశ్
  •  పూణేలో జరుగుతోన్న షూటింగు 
  • సెప్టెంబర్లో విడుదల చేసే ఆలోచన
'మహానటి' సినిమాతో తెలుగులో కీర్తి సురేశ్ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది. ఆ తరువాత ఆమె వరుస తమిళ సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తెలుగులో ఆమె నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో .. స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. నగేశ్ కుకునూర్ నుంచి ఇంతకుముందు 'హైదరాబాద్ బ్లూస్' .. 'ఇక్బాల్' వంటి చిత్రాలు వచ్చాయి.

ఆయన తాజా చిత్రానికి సుధీర్ చంద్ర - శ్రావ్యవర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తారనీ .. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడని చెప్పుకున్నారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్స్ లేవు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందేమోనని అనుకున్నారు. కానీ సైలెంట్ గా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోందట. ప్రస్తుతం పుణేలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. త్వరలో టైటిల్ ను ఖరారు చేసుకుని, సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు.
keerthi suresh

More Telugu News