జయలలిత మృతి కేసు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు
- కేసును విచారిస్తున్న అరుముగస్వామి కమిషన్
- తమ డాక్టర్లను వేధిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించిన అపోలో హాస్పిటల్స్
- కమిషన్ విచారణపై అభ్యంతరం
జయ వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ సహా 100 మందికి పైగా వ్యక్తులను అరుముగస్వామి కమిషన్ ప్రశ్నించింది. వీరిలో అపోలో ఆసుపత్రి రేడియాలజిస్ట్ డాక్టర్ మీరా, ఎమర్జెన్సీ డాక్టర్ పజని కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, తమ వైద్యులను కమిషన్ వేధిస్తోందంటూ అపోలో యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.