పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యం.. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు
- పరీక్షల్లో గెలవడమే జీవితం కాదు
- తల్లిదండ్రుల ఆశలను చిదిమేయొద్దు
- ప్రపంచంలోని విజేతలందరూ తొలుత పరాజితులే
ఈ ప్రపంచంలో విజేతలుగా నిలిచిన వారందరూ తొలుత పరాజితులేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. చదువు విజ్ఞానం పెంచుకోవడానికేనని, అదే జీవితం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. విజయానికి ఓటమి తొలిమెట్టు అని, మళ్లీ కష్టపడితే మంచి ఫలితం వస్తుందని సూచించారు. ఎంచుకున్న రంగాల్లో ప్రతిభ చూపితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందని, మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు మీరిచ్చే గొప్ప బహుమతి అని చంద్రబాబు ధైర్యం నూరిపోశారు.