వీడియో బయటపెడతానంటూ కేంద్ర మంత్రిని బ్లాక్ మెయిల్ చేసిన మహిళ అరెస్ట్
- కేంద్ర మంత్రి మహేశ్ శర్మను బ్లాక్ మెయిల్ చేసిన మహిళ
- రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్
- గత కొన్ని రోజులుగా పలుకుబడి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్న ముఠా
సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసే ముఠా పని ఇదని వైభవ్ తెలిపారు. అయితే, ఒక వీడియో లభ్యమైందని... ఒక అమ్మాయితో మహేశ్ శర్మ మాట్లాడుతున్నట్టుగా మాత్రమే వీడియోలో ఉందని, అంతకు మించి అందులో వివాదాస్పదమైన సన్నివేశాలు లేవని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఈ రాకెట్ సభ్యులు ఇదే పనిలో ఉన్నారని... గ్యాంగ్ లోని ఇతర సభ్యులను కూడా గుర్తించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు.