ఏపీలో ఒకేరోజున రెండు పరీక్షలు.. ఏది రాయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్న నిరుద్యోగులు!
- వచ్చే నెల 5న గ్రూప్-2 పరీక్షల నిర్వహణ
- అదే రోజున ఎల్ఐసీ ఏఏవో పరీక్షలు కూడా
- వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు
అయితే గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా తాము పలుమార్లు కోరినా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పట్టించుకోలేదని కొందరు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయి పరీక్షలను వాయిదా వేసేవారని , కానీ ఏపీపీఎస్సీ ఆ సంప్రదాయాన్ని ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.