తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న క్రికెటర్ గౌతం గంభీర్

  • ఇటీవలే బీజేపీలో చేరిన గంభీర్
  • అరవింద్ సింగ్ లవ్లీ, అతిషిలను ఎదుర్కోనున్న గంభీర్
  • గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్
ఇటీవల బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎన్నికల బరిలోకి దిగాడు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం టికెట్‌ను అధిష్ఠానం అతనికి కేటాయించింది. ఢిల్లీలోని ఏడు స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ మహేశ్ గిరి స్థానంలో బరిలోకి దిగిన గంభీర్ కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషిలను ఎదుర్కోనున్నాడు.

కాగా, ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నలుగురు సిట్టింగులకు తిరిగి టికెట్లు కేటాయించింది. కాగా, ఏడో స్థానమైన నార్త్-వెస్ట్ (వాయవ్య) ఢిల్లీ నియోజకవర్గానికి బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడింటికి ఏడు స్థానాలనూ కైవసం చేసుకుంది.
Go Back to Shorts
Congress
BJP
Goutam gambhir
New Delhi

More Telugu News