బీజేపీకి అధికారం కలే.. మాకూ మెజారిటీ రాదనుకుంటున్నా: మధ్యప్రదేశ్ సీఎం
- కేంద్రంలో హంగ్ తథ్యం
- మిత్రపక్షాలతో కలిసి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
- ‘న్యాయ్’ పథకం అమలుకు వనరులున్నాయి
తన హయాంలో దేశం భద్రంగా ఉందంటూ మోదీ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని, బీజేపీ హయాంలోనే దేశంలో అత్యధిక ఉగ్రదాడులు జరిగాయని కమల్నాథ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చిన ‘న్యాయ్’ ఓ విప్లవాత్మక పథకమన్న కమల్నాథ్ దాని అమలుకు సరిపడా వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆ పథకం కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ఐదు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కమల్నాథ్ పేర్కొన్నారు.