ముగిసిన మూడవ విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం
- 23న 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్
- రాహుల్, అమిత్ షా పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా
- అనంతనాగ్ లో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఎన్నికలు
కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి అమిత్ షాలు పోటీ చేస్తున్న లోక్ సభ స్థానాలకు ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. కాగా, జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ నియోజకవర్గంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి.