అక్క పిల్లల్ని తీసుకొస్తూ.. రోడ్డు ప్రమాదంలో పిల్లలతో సహా మేనమామ అనంత లోకాలకు..!
- కారు, ద్విచక్ర వాహనం పరస్పరం ఢీ
- ప్రమాదంలో మేనమామ, మేనకోడళ్లు మృతి
- మరో చిన్నారి పరిస్థితి విషమం
వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మేనమామతోపాటు ఇద్దరు మేనకోడళ్లూ అక్కడికక్కడే మృతి చెందగా, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.