'దబాంగ్ 3'లో ఛాన్స్ దక్కించుకున్న అలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దబాంగ్ 3'లో ఛాన్స్ దక్కించుకున్న అలీ

  • ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన 'దబాంగ్ 3'
  • సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా 
  • ప్రతినాయకుడిగా సుదీప్    
తెలుగులో బ్రహ్మానందం తరువాత ఆ స్థాయి కమెడియన్ ఎవరు? అంటే అలీ పేరే వినిపిస్తుంది. నిజం చెప్పుకోవాలంటే బ్రహ్మానందం కంటే అలీనే సీనియర్. తెలుగులో అలీ ఎన్నో విభిన్నమైన .. విలక్షమైన పాత్రలను చేస్తూ మెప్పిస్తూ వచ్చాడు. హీరోగా చేసినా .. కమెడియన్ గా తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అలాంటి అలీ ఏకంగా 'దబాంగ్ 3' సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నాడు.

'దబాంగ్' సిరీస్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సిరీస్ లో చిన్న ఛాన్స్ దొరకడం కూడా అంతా ఆషామాషీ విషయమూ కాదు. అలాంటిది 'దబాంగ్ 3'లో చేసే అవకాశాన్ని అలీ దక్కించుకున్నాడు. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో అలీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఆ సమయంలోనే ఈ సినిమా సెట్ లో సల్మాన్ తో కలిసి తన ఫ్యామిలీతో అలీ ఫొటో దిగాడు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, సుదీప్ విలన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. 
Salman Khan
Sonakshi Sinha

More Telugu News