అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగుబాటు!

  • ఏపీలోని విశాఖపట్నంలో ఘటన
  • అనుమానంతో భార్య శారదకు పైడిరాజు వేధింపులు
  • వాగ్వాదం జరగడంతో భార్యపై కత్తితో దాడి
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఆమెపై కత్తితో దాడిచేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విశాఖలోని కొత్తపాలెం సమీపంలో ఉన్న నాగేంద్ర కాలనీలో ఎద్దు పైడిరాజు తన భార్య శారదతో కలిసి ఉంటున్నాడు. అయితే భార్య శారద మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పైడిరాజు అనుమానించేవాడు. అంతేకాకుండా ఈ విషయమై రోజూ హింసిస్తూ వేధించేవాడు. ఇదే క్రమంలో నిన్న రాత్రి ఇంటికొచ్చిన పైడిరాజు మరోసారి భార్యతో గొడవకు దిగాడు. దీంతో దంపతుల మధ్య వాగ్వాదం చెలరేగింది. సహనం కోల్పోయిన పైడిరాజు భార్యపై కత్తితో దాడిచేశాడు.

ఈ ఘటనతో తీవ్రంగా గాయపడ్డ శారద ప్రాణాలు కోల్పోయింది. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న పైడిరాజు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కు కత్తితో వెళ్లి లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్ కు పంపారు. శారద మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Visakhapatnam District
husband killed wife
knife
Police

More Telugu News