తెలంగాణలో ‘ఉగ్ర’ కలకలం.. హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారుల సోదాలు!
- మైలార్ దేవ్ పల్లిలోని శాస్త్రిపురంలో ఘటన
- స్థానిక పోలీసుల సాయంతో అధికారుల సోదాలు
- ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు
ఈరోజు ఉదయం 8 గంటలకు శాస్త్రిపురంలోని 8 మంది ఐసిస్ సానుభూతిపరులకు సంబంధించిన ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. గతేడాది అరెస్ట్ అయిన అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ తనిఖీల్లో ఏం బయటపడింది అన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాలేదు.