Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పత్రికా స్వేచ్ఛలో నాలుగు స్థానాలు దిగువకు పడిపోయిన భారత్‌

  • 2017వ సంవత్సరంలో 136వ స్థానం
  • 2018వ సంవత్సరంలో 140వ స్థానం
  • పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్‌ విడుదల చేసిన ఆర్‌ఎస్‌ఎఫ్‌
పత్రికా స్వేచ్ఛలో కాస్త మెరుగు పడ్డామని గత ఏడాది లభించిన సంతోషం ఏడాది తిరిగేలోపే ఎగిరిపోయింది. ఈ ఏడాది నాలుగు స్థానాలు దిగువకు భారత్‌ పడిపోయింది. ప్రపంచంలోని 180 దేశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేసిన రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఇండెక్స్‌లో భారత్ 140వ  స్థానంలో నిలిచింది.

2017వ సంవత్సరంలో 136వ స్థానంలో భారత్‌ ఉంది. 2018లో దేశవ్యాప్తంగా ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వీరిలో గౌరీలంకేష్‌ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. హత్య చేసిన వారంతా కేంద్రంలోని అధికార బీజేపీ మద్దతుదారులేనన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల అరాచకాలు, రాజకీయ నాయకుల వేధింపులు, మావోయిస్టుల దారుణాలు జర్నలిస్టులను ఒత్తిడికి గురి చేస్తున్నాయని, దీంతో స్వేచ్ఛగా వార్తలు రాయలేకపోతున్నారని నివేదిక పేర్కొంది.
media freedom
india place 140
RSF index

More Telugu News