జీవీఎల్ పై చెప్పు విసిరింది ఓ డాక్టర్.. దాడి ఎందుకు చేశాడంటే..!
- ఢిల్లీలో బీజేపీ నేత జీవీఎల్ సమావేశం
- చెప్పు విసిరిన కాన్పూర్ డాక్టర్ భార్గవ
- గతేడాది భార్గవ ఆసుపత్రిపై ఐటీ దాడులు
ఈయన కాన్పూర్ లో భార్గవ హాస్పిటల్ ను నడుపుతున్నాడని అన్నారు. మూడు ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేసిన విషయంలో ఐటీ అధికారులు 2018లో భార్గవకు చెందిన ఆసుపత్రిపై దాడులు నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.50 లక్షల విలువైన నగలతో పాటు రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మూడు ఖరీదైన భవంతులను శక్తి భార్గవ రూ.11.50 కోట్లు వెచ్చించి కొన్నారనీ, అయితే ఇందుకు అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆయన చెప్పలేదన్నారు.
అంతేకాకుండా ఈ మూడు భవంతులను భార్య, పిల్లల పేరుపై ఆయన రిజిస్టర్ చేయించారని అన్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన బినామీ చట్టం కింద విచారణ సాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వ తీరుపై మనస్తాపం చెందిన భార్గవ.. తన నిరసనను తెలియజేసేందుకే అధికార పార్టీ నేత అయిన జీవీఎల్ పై చెప్పును విసిరాడని వ్యాఖ్యానించారు.