చంద్రబాబు గారికి ధన్యవాదాలు: స్టాలిన్

  • డీఎంకేకు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు
  • మోదీ, అన్నాడీఎంకే ప్రభుత్వాలను ఇంటికి పంపిస్తాం
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటంలో ముందు వరుసలో ఉంటాం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీఎంకే అధినేత స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు చెన్నై వెళ్లిన చంద్రబాబు... డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీకి మద్దతుగా ప్రసంగించిన సంగతి తెలిసిందేే. ఈ సందర్భంగా స్టాలిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'చెన్నైకి వచ్చి డీఎంకేకు మద్దతు ప్రకటించిన శ్రీ చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నియంతృత్వ మోదీ ప్రభుత్వాన్ని, అవినీతిలో కూరుకుపోయిన తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో డీఎంకే ముందు వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నా' అని తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
stalin
Telugudesam
cmk
modi
bjp

More Telugu News