తన రాజకీయ పార్టీ గుర్తేంటో చెప్పేసిన హీరోయిన్ ఆలియా భట్!
- నేను రాజకీయాల్లోకి వస్తే 'ప్లేట్' సింబల్
- ప్లేట్ కు జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది
- ఈ గుర్తును ఇంతవరకూ ఎవరూ ఎంచుకోలేదు
- కపిల్ శర్మ షోలో ఆలియా భట్
ప్రస్తుతం తాను నటించిన 'కళంక్' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆమె, కపిల్ శర్మ షోలో వరుణ్ ధావన్ తో కలిసి పాల్గొంది. ఇక ఆలియా భట్ కే వేసిన ప్రశ్నను వరుణ్ ను అడుగగా, తాను 'చెడ్డీ'ని గుర్తుగా ఎంచుకుంటానని చెప్పడంతో, వీక్షకులంతా నవ్వుల్లో మునిగిపోయారు. కాగా, ఆలియా, వరుణ్ లతో పాటు సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆదిత్యా రాయ్ కపూల్ తదితరులతో నిర్మాత కరణ్ జోహార్ 'కళంక్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇటీవలే సినిమా టీజర్, ట్రయిలర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.