బీజేపీ తరఫున ఎంపీగా పోటీచేస్తున్న 'రేసుగుర్రం' విలన్

  • 'రేసుగుర్రం' నటుడికి కమలం పార్టీ టికెట్
  • సోమవారం ప్రకటించిన జాబితాలో రవికిషన్ పేరు
  • గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ
టాలీవుడ్ లో కొంతకాలం కిందట వచ్చిన రేసుగుర్రం చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రవికిషన్ అనే భోజ్ పురి కథానాయకుడు విలన్ గా నటించి మెప్పించాడు. మద్దాలి శివారెడ్డి పాత్రతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన రవికిషన్ ఆపై అనేక చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఇప్పుడీ నటుడు రాజకీయాల్లో ప్రవేశించి ఎంపీగా పోటీచేస్తున్నాడు. రవికిషన్ కు బీజేపీ యూపీలోని గోరఖ్ పూర్ నియోజకవర్గం సీటును కేటాయించింది.

బీజేపీ అధినాయకత్వం సోమవారం ఏడుగురు యూపీ అభ్యర్థులను  ప్రకటించగా అందులో రవికిషన్ పేరు కూడా ఉంది. ఈ భోజ్ పురి నటుడు పోటీచేస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గం కమలనాథులకు కంచుకోట అని చెప్పాలి. ప్రస్తుతం యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ గతంలో ఇక్కడినుంచి ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.
Go Back to Shorts
Ravikishan
Tollywood

More Telugu News