శ్రద్ధా కపూర్ ను ఒప్పించే ప్రయత్నంలో 'ఆర్ ఆర్ ఆర్' టీమ్
- ఎన్టీఆర్ జోడీ కోసం అన్వేషణ
- తెరపైకి శ్రద్ధా కపూర్ పేరు
- హిందీ సినిమాలతో బిజీగా శ్రద్ధా
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నాయికగా డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో శ్రద్ధా కపూర్ ను గానీ .. పరిణితీ చోప్రాను గాని తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. పాత్రపరంగా శ్రద్ధా కపూర్ అయితేనే సెట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడట. అయితే ఆమె 'చిచ్చోరే' .. 'స్ట్రీట్ డాన్సర్' సినిమాలు కూడా సెట్స్ పై వున్నాయి. అయినా డేట్స్ సర్దుబాటు చేయించి .. ఈ సినిమాకి తీసుకురావాలనే దిశగా రాజమౌళి సినిమా టీమ్ ప్రయత్నాలు చేస్తోందట. ఈ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.