కోడ్ అమలులో.. ఈసీ పనితీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి... ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ
- అధికారుల సమాధానంపై సంతృప్తి చెందని కోర్టు
- రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
- విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్య
ఈ సందర్భంగా కోడ్ అమలు చేయడంలో ఈసీ పనితీరుపై దృష్టిసారించిన కోర్టు ఎన్నికల అధికారుల వివరణ కోరింది. దీనిపై ఈసీ సమాధానం ఇస్తూ నేతల వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల సేవలను వినియోగించు కోవడంలో ఈసీ విఫలమవుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈసీ తరపున పూర్తి వివరాలతో ఓ అధికారిని రేపు కోర్టుకు పంపాలని సుప్రీం ఆదేశించింది.