దర్శకుడు సుకుమార్ భార్య లాండ్రీ వ్యాపారం... యాప్ లాంచ్ చేసిన సమంత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకుడు సుకుమార్ భార్య లాండ్రీ వ్యాపారం... యాప్ లాంచ్ చేసిన సమంత

  • తబితా సుకుమార్ కు సమంత మద్దతు
  • ఉద్యోగులకు ఈ సర్వీసు ఎంతో ఉపయుక్తం అంటూ కితాబు
  • గతేడాది జూన్ లో ప్రారంభమైన లాండ్రీకార్ట్
చిత్ర పరిశ్రమలో ఒకప్పటితో పోలిస్తే నేటితరం కళాకారుల్లో ఆర్థిక భద్రతపై ఎంతో అవగాహన కనిపిస్తోంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే క్రమంలో అనేక వ్యాపారాల్లో భాగస్వాములుగా చేరడమో, తామే స్వంతగా బిజినెస్ ప్రారంభించడమో చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ అర్ధాంగి తబిత గతేడాది లాండ్రీ వ్యాపారం ప్రారంభించారు. అలేఖ్య, గిరిజ, శరత్ అనే తన స్నేహితులతో కలిసి లాండ్రీకార్ట్ పేరుతో సంస్థను స్థాపించారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ యాప్ ను ప్రముఖ హీరోయిన్ సమంత లాంచ్ చేశారు.

హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సమంత యాప్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరిగా మారిన ప్రస్తుత కాలంలో లాండ్రీకార్ట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. లాండ్రీకార్ట్ యాప్ ఎంతో సులువుగా ఉపయోగించుకునేలా ఉంటుందని అన్నారు.

లాండ్రీకార్ట్ ప్రధానంగా మిడిల్ క్లాస్ ను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించినట్టు తబిత సుకుమార్ వెల్లడించారు. ఇందులో ప్రీమియం లాండ్రీ, డ్రైక్లీనింగ్ పేరిట రెండు రకాల సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రీమియం లాండ్రీలో క్యాజువల్స్ ను శుభ్రం చేస్తామని, డ్రైక్లీనింగ్ లో బ్రాండెడ్ దుస్తులను శుభ్రం చేస్తామని ఆమె వివరించారు.
Samantha
Tollywood

More Telugu News