Lavanya: రెండు రోజుల క్రితం అదృశ్యం... ట్రావెల్ బ్యాగ్ లో లభ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య మృతదేహం!

  • సురారం కాలువలో మృతదేహం
  • హత్య చేసి ట్రావెల్ బ్యాగ్ లో కుక్కిన నిందితులు
  • ప్రేమ వ్యవహారమే కారణమంటున్న పోలీసులు
రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య ఈ ఉదయం విగతజీవిగా కనిపించింది. ఓ సూట్ కేసులో కుక్కిన ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ శివార్లలోని సురారం కాలువలో పోలీసులు కనుగొన్నారు. ఆమెను దారుణంగా హత్య చేసి, ఆపై ట్రావెల్ బ్యాగ్ లో కుక్కిన గుర్తు తెలియని దుండగులు, ఆ బ్యాగ్ ను కాలువలో పడేసి వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. లావణ్య అదృశ్యమైందన్న ఫిర్యాదును అందుకున్నప్పటి నుంచి ఆమె సెల్ ఫోన్ రికార్డులను పరిశీలించిన పోలీసులు, హత్య వెనుక ప్రేమ వ్యవహారం ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నామని, నిందితులను గుర్తించి, వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెబుతున్నారు.
Lavanya
Softwear Engeneer
Suraram
Dead Body
Travel Bag

More Telugu News