వామ్మో.. ఎంత పెద్ద విమానమో.. విజయవంతంగా టేకాఫ్!
- బరువు రెండు లక్షల కిలోలు
- రెక్కల పొడవు 385 అడుగులు
- కాలిఫోర్నియాలోని మోజేవే విమానాశ్రయం నుంచి టేకాఫ్
గాలిలో నుంచి కక్ష్యలోకి రాకెట్లను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించి ఈ విమానాన్ని తయారుచేశారు. ఆరు ఇంజిన్లు, రెండు విమాన బాడీలు (డ్యూయల్ ఫ్యూజ్‌లేజ్) కలిగిన ఈ విమానం గరిష్టంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగరగలదు. ఈ విమానం విజయవంతంగా టేకాఫ్ కావడంతో ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యంత బరువైన విమానం టేకాఫ్ అయిన రికార్డును సొంతం చేసుకుంది.