రాష్ట్రానికి చంద్ర గ్రహణం వీడనుంది: బొత్స

  • చినకుదమ గ్రామంలో శ్రీవాణిపై టీడీపీ నేతల దాడి
  • ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేశారు
  • మా అభ్యర్థి పుష్ప శ్రీవాణి పై దాడిని ఖండిస్తున్నా
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీవాణి పై టీడీపీ నేతలు జరిపిన దాడిని ఖండిస్తున్నానని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఈ ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడనుందని అన్నారు.

కాగా, విజయనగరం జిల్లాలోని చినకుదమ గ్రామంలోని పోలింగ్ బూత్ లోకి ఓటర్లను టీడీపీ నేతలు రానీయకుండా ఏకపక్షంగా ఓట్లు వేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత శత్రుచర్ల పరీక్షిత్ రాజు అక్కడికి వెళ్లగా, ఆయన్ని టీడీపీ కార్యకర్తలు నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న పుష్పశ్రీవాణి అక్కడికి వెళ్లగా ఆమెపై టీడీపీ నేత రామకృష్ణ, ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
Go Back to Shorts
Vijayanagaram District
YSRCP
Srivani
botsa

More Telugu News