టాలీవుడ్ లో సమంతను మించిన కోడలు లేదంటూ ఉపాసన కితాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ లో సమంతను మించిన కోడలు లేదంటూ ఉపాసన కితాబు

  • ఉపాసన కితాబు
  • బెస్ట్ కోడలు అవార్డు ఆమెకు ఇవ్వాలంటూ కామెంట్
  • సమంతను ఇంటర్వ్యూ చేసిన ఉపాసన
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ మాత్రమే కాదు, 'బీ పాజిటివ్ హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్' మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్ కూడా. తన మ్యాగజైన్ కోసం ఇటీవలే ప్రముఖ హీరోయిన్ సమంతను ఆమె ఇంటర్వ్యూ చేశారు. జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న సమంతతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం ఉపాసన తన అభిప్రాయాలు వెల్లడించారు.

టాలీవుడ్ లో అత్యుత్తమ కోడలు అవార్డు ఇస్తే సమంతకే ఇవ్వాలన్నారు. సమంత స్వీటెస్ట్ మాత్రమే కాదు, పవర్ ఫుల్ కూడా అంటూ కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఉపాసన అక్కినేని వారి కోడలితో పలు హెల్త్ సీక్రెట్స్, బ్యూటీ టిప్స్, ఫిట్ నెస్ వర్కౌట్ల గురించి వివరాలు రాబట్టారు. తన మ్యాగజైన్ తాజా ఎడిషన్ లో సమంత ముఖచిత్రంతో ప్రత్యేక కథనాన్ని పొందుపరిచారు.
Samantha
Upasana
Tollywood

More Telugu News