ఎయిర్ పోర్టులో నేలపైనే పడుకుని నిద్రపోయిన ధోనీ, సాక్షి!
- నిన్న రాత్రి మ్యాచ్ తరువాత ఎయిర్ పోర్టుకు చెన్నై టీమ్
- తగినంత విశ్రాంతి లేక నేలపైనే పడుకున్న సాక్షి, ధోనీ
- వైరల్ అవుతున్న ఫోటో
ఆపై రెండు రోజుల వ్యవధిలోనే అంటే గురువారం నాడు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చెన్నై ఆడాల్సివుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టు హడావుడిగా ఎయిర్ పోర్టుకు వచ్చింది. విమానం రావడానికి సమయం ఉండటంతో, అప్పటికే విశ్రాంతి లేని ధోనీ నేలపైనే పడుకుని కునుకుతీశారు. భర్తను ఆనుసరించిన సాక్షి, అతని పక్కనే పడుకుని నిద్రపోయింది. ఆ సమయంలో మిగతా ఆటగాళ్లు కుర్చీల్లో కూర్చుని సేదదీరుతున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్, ధోనీకి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, ఆయన చాలా సింపుల్ గా ఉంటారని మరోసారి ప్రూవ్ అయిందని కామెంట్లు పెడుతున్నారు.