హైదరాబాదులో.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం!
- హైదరాబాద్ లోని శాలిబండలో ఘటన
- చిన్నారికి చాక్లెట్ ఆశచూపిన కామాంధుడు
- దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
అనంతరం లైంగికదాడికి యత్నించాడు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా బెదిరిపోయిన బాలిక.. గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకోగానే నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు మరికాసేపట్లో కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.