చంద్రబాబునే మళ్లీ సీఎం చేయండి: దేవెగౌడ
- రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు
- జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు
- దేశంలోని వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
పేపర్ బ్యాలెట్ కోసం తాము చేస్తున్న పోరాటం కొనసాగుతుందని దేవెగౌడ తెలిపారు. మోదీ ప్రభుత్వం దేశంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కూటమి బలంగా ఉందని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ శాఖను ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను ఏక తాటిపైకి తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు.