జగన్‌ గారూ.. రాజ్‌దీప్‌తో రాజధానిలో ఒక్క ఇటుక కూడా లేదన్నారుగా.. ఇది చూడండి: శివాజీ

  • అద్భుతంగా సాగుతున్న రాజధాని నిర్మాణాన్ని చూపించిన శివాజీ
  • సిద్ధమైన అధికారుల నివాస భవనాలు
  • అబద్ధాలను పదేపదే ప్రచారం చేసినా ప్రజలు నమ్మబోరని జగన్‌కు హితవు
పోలవరం టీవీ ప్రజెంటేషన్ తర్వాత నటుడు శివాజీ అమరావతిలో తాను పర్యటించిన వీడియోను ప్రదర్శించారు. గతంలో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జగన్ మాట్లాడుతూ.. ఈ నాలుగేళ్లలో ఏపీ రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని పేర్కొన్న విషయాన్ని ఈ వీడియోలో చూపించారు. ఆ తర్వాత రాజధానిలో ప్లాస్టింగ్ కూడా అయిపోయిన ఎనిమిది టవర్లను చూపించి ఇప్పుడేమంటారు జగన్ గారూ? అని ప్రశ్నించారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా నివాసాలు ఉంటాయని ఎద్దేవా చేశారు.

ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నివాసం కల్పించే భవన సముదాయాలను చూపించిన శివాజీ వాటికి రంగులు కూడా వేసి సిద్ధం చేస్తున్న దృశ్యాన్ని చూపించారు. జగన్ అధికారంలోకి వస్తే అద్భుతమైన ఈ రాజధానిని తరలిస్తామని చెబుతున్నారని, ఎవడబ్బ సొమ్మని తరలిస్తారని ఘాటుగా ప్రశ్నించారు. అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకోవడం భ్రమేనని శివాజీ తేల్చి చెప్పారు.
Go Back to Shorts
Jagan
Sivaji
The truth
Actor
Andhra Pradesh
Amaravati

More Telugu News