జగన్ సీఎం కావడం ఖాయం.. ఏపీ ప్రత్యేక హోదాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం!: మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
- ప్రధాని పదవికి కేసీఆర్ అర్హుడు
- చంద్రబాబుకు నిబద్ధత లేదు
- ముస్లింలకు డిప్యూటీ సీఎం అని కొత్త పాట అందుకున్నారు
- మీడియాతో హైదరాబాద్ ఎంపీ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఒవైసీ పునరుద్ఘాటించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ నిబద్ధత లేదని స్పష్టం చేశారు. గోద్రా అల్లర్ల సమయంలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగానే కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇన్నేళ్లు ముస్లిం వర్గాన్ని దూరం పెట్టిన బాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కొత్త రాగం అందుకున్నారని దుయ్యబట్టారు.
ఏపీ ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదని ఒవైసీ తేల్చిచెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఒవైసీ తెలిపారు. హోదా సాధించేందుకు జగన్ కు భారీ మెజారిటీతో గెలుపును కట్టబెట్టాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.