జగన్ కంటే ఎక్కువ కేసులు ఉన్న వైసీపీ నేత ఈయనే!
- 31 కేసులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్న జగన్
- తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డిపై 32 కేసులు
- వీటిలో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని అఫిడవిట్ లో తెలిపిన కేతిరెడ్డి
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఏకంగా 32 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులు 1985 నుంచి 2019 వరకు నమోదై ఉన్నాయి. ఆయనపై పోలీసులు 1987లోనే రౌడీషీట్ తెరిచారు. తుపాకులు, బాంబులతో దాడి చేయడం, కిడ్నాప్, హత్యలు, ఆస్తులను నష్టపరచడం లాంటి కేసులు ఆయనపై ఉన్నాయి. ఈయనపై ఉన్న కేసుల్లో అత్యధికంగా యల్లనూరు పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. అయితే, వీటిలో కొన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయని తన అఫిడవిట్ లో కేతిరెడ్డి తెలిపారు.