డబ్బున్న వాళ్ల కోసం నిలబడే మోదీ ఓ ‘జీరో’: విజయశాంతి
- పేదవాడి కోసం మోదీ పనిచేయట్లేదు
- పేద ప్రజల కోసం ఉన్నది కాంగ్రెస్ పార్టీయే
- ప్రజల తరపున నిలబడ్డ రాహుల్ గాంధీ ఓ హీరో
పేద ప్రజల కోసం ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజల తరపున నిలబడ్డ వాళ్లెవరైనా హీరోనే అని, ఆ హీరో రాహుల్ గాంధీ అని కొనియాడారు. డబ్బున్న వాళ్ల కోసం నిలబడే మోదీ ఓ ‘జీరో’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ బీజేపీ లేదు కానీ, కేసీఆర్ ఉన్నారని, మోదీ, కేసీఆర్, జగన్, ఈ ముగ్గురూ ఒకటేనని అన్నారు. కేసీఆర్ కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే, ఆడవాళ్ల నగలను కూడా పట్టుకుపోతారని సెటైర్లు విసిరారు. గెలుపుపై ధీమాతో మోదీ ఉన్నారని, ఆయనకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు.