మరింత భయపెడుతోన్న 'కాంచన 3' ట్రైలర్
- లారెన్స్ నుంచి 'కాంచన 3'
- ప్రత్యేక ఆకర్షణగా లారెన్స్ లుక్
- ఏప్రిల్ 19న రిలీజ్ చేసే ఛాన్స్
సస్పెన్స్ .. హారర్ .. యాక్షన్ సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నెరిసిన గెడ్డం మీసాలతో .. కాస్త వయసు మళ్లిన లుక్ తో లారెన్స్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రధాన ప్రత్యేకత ఈ లుక్ అనే చెప్పాలి. ఈ సినిమాలో బలమైన ప్రతినాయకుడిగా కబీర్ దుహాన్ సింగ్ కనిపిస్తున్నాడు. నువ్వా నేనా అన్నట్టుగా ఈ ఇద్దరి మధ్య సీన్స్ వుంటాయనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. వేదిక .. ఓవియా కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది